Accham naidu: తుఫాన్లకు దెబ్బతిన్న ధాన్యాన్ని సైతం సేకరిస్తున్నాం..! 17 d ago
AP: వ్యవసాయంతో పాటు అనుబంధ సంస్థలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వ్యవసాయంపై చర్చకు వచ్చే ధైర్యం వైసీపి నేతులకు ఉందా అని ప్రశ్నించారు. గతంలో ధాన్యం సేకరించి రైతులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని ఇప్పుడు ప్రకృతి విపత్తులు, తుఫాన్లకు దెబ్బతిన్న ధాన్యాన్ని సైతం కూటమి ప్రభుత్వం సేకరిస్తుందన్నారు.